Social 1080×1350 • Multi-page
20-12-2024 BREAKING NEWS 07:48 PM
swarnodayam.com
Telugu Daily News

కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం

కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం
IMG_20241220_194538

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మానవ వికాస వేదిక 20 వసంతాల వేడుకలు హైదరాబాదులోని బాటసింగారం, రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుండి మేధావులు, వక్తలు, వచ్చి అమూల్యమైన సందేశాలు ఇవ్వడం జరిగింది. మానవ వికాస వేదిక 20 సంవత్సరాలుగా చేసినటువంటి కార్యక్రమాలను సభాముఖంగా తెలియజేయడం జరిగింది. మానవ వికాస వేదిక కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల నాయకులు, సభ్యులు మరియు మిత్ర సంఘాల నాయకులు కార్యకర్తలు అనేకమంది వచ్చి 20 వసంతాల వేడుకలను విజయవంతం చేయడం జరిగింది. ఈ వేడుకల అనంతరం రాష్ట్ర కమిటీలు కేంద్ర కమిటీలు, జిల్లా కమిటీలను, మానవ వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కేంద్ర కమిటీ అధ్యక్షులు బి సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రకటించారు.

కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులుగా సాదుల రవీందర్ బాబు, అధ్యక్షులుగా భోగం రమేష్, ఉపాధ్యక్షులుగా కొంకటి స్వామి, ప్రధాన కార్యదర్శిగా కలకోటి వెంకటేష్, సహాయ కార్యదర్శిగా సొల్లు రమేష్, కోశాధికారి :గోపగాని లింగయ్య, కార్యవర్గ సభ్యులుగా చౌడమల నాగరాజు (హుజురాబాద్), ఎలబద్రి రాజమౌళి ఇల్లంతకుంట
కరీంనగర్ జిల్లా నూతన కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని మానవ వికాస వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంటాల బుచ్చయ్య తెలిపారు.

Oplus_131072 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంటాల బుచ్చయ్య
Oplus_131072 జిల్లా ప్రధాన కార్యదర్శి
Oplus_131072 జిల్లా అధ్యక్షుడు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!