20-12-2024 NORMAL NEWS 09:09 PM
swarnodayam.com
Telugu Daily News
20-12-2024 09:09 PM By Mandala Yadagiri

నూతన పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలి..టాప్రా జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ డి

నూతన పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలి..టాప్రా జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ డి
IMG_20241220_210707

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెన్షనర్లకు నూతన పిఆర్ సి ని జూలై 2023 నుండి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ నేటికీ వేయలేదని వెంటనే పిఆర్సి ప్రకటించాలని టాప్రా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, గౌరవ అధ్యక్షులు కట్ట నాగభూషణాచారి డిమాండ్ చేశారు. శుక్రవారం హుజురాబాద్ లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, గౌరవ అధ్యక్షుడు కట్ట నాగభూషణాచారి మాట్లాడుతూ….ప్రభుత్వం వెంటనే పిఆర్సి నివేదికను తెప్పించుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా నూతన పిఆర్ సి ని ప్రకటించి జూలై 2023 నుండి అమలుపరుస్తూ ఏరియర్స్ ఏక మొత్తంలో నగదు రూపంగా చెల్లించాలని అన్నారు. జనవరి 2023 నుండి జూలై 2024 వరకు పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఈ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులతో పాటు అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని వారు కోరారు.

చందుపట్ల జనార్ధన్

కట్ట నాగభూషణాచారి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!