Social 1080×1350 • Multi-page
21-12-2024 BREAKING NEWS 09:13 PM
swarnodayam.com
Telugu Daily News

26వ వార్డులో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ

26వ వార్డులో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ
IMG_20241221_211720

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని 26వ వార్డులో శనివారం అభివృద్ధి పనులకు మునిసిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ప్లాన్, నాన్ ప్లాన్ కింద సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం, ఇతర నిర్మాణ అభివృద్ధి పనుల కోసం రూ. ఐదు లక్షలు మంజూరు కాగా.. పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలో 26వ వార్డు అభివృద్ధి, సంక్షేమంలో ముందుందని పేర్కొన్నారు. వార్డు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్థానిక కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసించారు. నిరంతరం వార్డు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటున్న కౌన్సిలర్ దంపతులకు ఈ సందర్భంగా వార్డు ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ సాంబరాజు, వర్క్ ఇన్స్పెక్టర్ వినయ్, వార్డు ప్రజలు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!