21-12-2024 NORMAL NEWS 10:57 PM
swarnodayam.com
Telugu Daily News
21-12-2024 10:57 PM By Mandala Yadagiri

చలో హైదరాబాద్ వెళ్లకుండా మున్సిపల్ కార్మికుల ముందస్తు అరెస్ట్

చలో హైదరాబాద్ వెళ్లకుండా మున్సిపల్ కార్మికుల ముందస్తు అరెస్ట్
IMG_20241221_225010

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ కార్మికులను చలో హైదరాబాద్ ఇంద్ర పార్క్ దగ్గర ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగానే ఈరోజు ఉదయం హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయడం జరిగింది. మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సెలవు హైదరాబాద్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న కార్మికులను వెళ్లకుండా అడ్డుకొని ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం వరకు స్టేషన్లో ఉంచుకొని సొంత పూచి కత్తుపై అనంతరం సీఐ తిరుమల్ వదిలిపెట్టారు. అరెస్టు అయిన కార్మికులలో మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు ఎండి ఆజ్జు, ఉపాధ్యక్షులు ఆర్ సరోజన, కోశాధికారి రొంటాల రాజేశ్వరి, రామగిరి సులోచన, బోరగాల కుమార్, వినోద తదితర కార్మికులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!