22-12-2024 NORMAL NEWS 10:48 PM
swarnodayam.com
Telugu Daily News
22-12-2024 10:48 PM By Mandala Yadagiri

మన ఊరు – మన కాంగ్రెస్ లో భాగంగా సిసి రోడ్లకు శంకుస్థాపన

మన ఊరు – మన కాంగ్రెస్ లో భాగంగా సిసి రోడ్లకు శంకుస్థాపన
IMG_20241222_224604

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మన ఊరు – మన కాంగ్రెస్ లో భాగంగా సిసి రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా మండలంలోని జూపక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో నూతనంగా మంజూరు అయిన రూ.25 లక్షల విలువగల సిసి రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని గ్రామస్తులకు ఈ సందర్భంగా ప్రణవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!