23-12-2024 NORMAL NEWS 03:09 PM
swarnodayam.com
Telugu Daily News
23-12-2024 03:09 PM By Mandala Yadagiri

అక్రమ కట్టడాలపై ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు..▪️రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము వెల్లడి.

అక్రమ కట్టడాలపై ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు..▪️రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము వెల్లడి.
IMG-20241223-WA0060

కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హెచ్ ఎన్ ఓ – 7- 4- 17/2 28వ వార్డు లోని ఎంప్లాయిస్ కాలనీలో పలు ఇల్లులు అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాములు అన్నారు. ఈ అక్రమ కట్టడంపై సోమవారం జిల్లా కలెక్టర్ కి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందని తేలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కందికట్ల సంధ్య వైఫ్ ఆఫ్ మధుసూదన్ అనే ఇంటి యజమాని నూతన మున్సిపల్ నిబంధనలను పాటించకుండా మున్సిపల్ ఆదాయానికి ఎగనామ పెడుతూ రాజకీయ నాయకుల అండదండలతో మమ్ములను అడిగే వారు లేరని ధీమాతో మున్సిపల్ నుండి సాధారణ గృహ నిర్మాణానికి అనుమతులు తీసుకుని టౌన్ ప్లానింగ్ నిబంధనలకు వ్యతిరేకంగా తన ఇష్టం వచ్చిన తీరుగా ఎలాంటి అనుమతులు లేకుండా పై అంతస్తు నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. ఈ అక్రమ కట్టడంపై ఈరోజు జిల్లా కలెక్టర్ కి, ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!