Social 1080×1350 • Multi-page
23-12-2024 BREAKING NEWS 08:45 PM
swarnodayam.com
Telugu Daily News

రాకేష్ సేవలు మరువలేని…ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్.

రాకేష్ సేవలు మరువలేని…ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్.
IMG_20241223_204728

కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా నాయకులు గురుకుంట్ల రాకేష్ సేవలు మరువలేనివని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. ఈనెల 14వ తారీకు నాడు జిల్లా నాయకులు రాకేష్ మహారాజ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ సందర్భంగా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో సోమవారం అయన ఆత్మ దిన సభ (సంస్మరణ సభ) నిర్వహించారు. ఈ సంస్కరణ సభకు డాక్టర్ విశారదన్ మహరాజ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత ఆరు సంవత్సరాలుగా సామాజిక సాంస్కృతిక స్వశక్తి ఉద్యమంలో, నేటి ధర్మ సమాజ్ పార్టీ వరకు ఉద్యమం పార్టీ నిర్మాణం కోసం ఎంతో క్రియాశీలకంగా పనిచేశారని అన్నారు. ఆయన అకాల మరణం వారి కుటుంబానికే కాకుండా, పార్టీకి కూడా తీరని నష్టాన్ని చేకూర్చుందని అన్నారు. కుటుంబం మనోధర్యంగా ఉండాలని అన్నారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తాళ్ళ నరేష్ మహారాజ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ మహారాజ్, జంబుద్వీప జన జాగృతి బాధ్యులు అంజన్ బాబు, వివిధ జిల్లాల నాయకులు, జిల్లా నాయకులు, పార్టీ అభిమానులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!