Social 1080×1350 • Multi-page
24-12-2024 BREAKING NEWS 03:54 PM
swarnodayam.com
Telugu Daily News

సినిమా యాక్టర్ అల్లుఅర్జున్ పై అదనపు కేసులు పెట్టాలని ఫిర్యాదు

సినిమా యాక్టర్ అల్లుఅర్జున్ పై అదనపు కేసులు పెట్టాలని ఫిర్యాదు
IMG-20241224-WA0085

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పుష్ప 2 సినిమా యాక్టర్ అల్లుఅర్జున్ పై అదనపు కేసులు పెట్టాలని, మరియు సినిమా హీరోయిన్ రష్మిక మందనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తు సీనియర్ న్యాయవాది, వ్యవస్థాపక అధ్యక్షులు సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కొత్తూరు రమేష్ మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంధ్య థియేటర్ హైదరాబాదులో జరిగిన తొక్కి సలాటలో చనిపోయిన రేవతి మరణానికి సంబంధించి మరియు రేవతి కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయంలో క్రైమ్ నెంబర్ 376 of 2024. ప్రకారం 105,118(1), 3(5) BNS. సెక్షన్ ల ప్రకారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అయితే ఈ కేసులో సెక్షన్ 177 of మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం అనుమతులు లేకుండా సినిమా యాక్టర్ అల్లు అర్జున్ తన సన్ రూప్ కార్ నుండి ప్రజలకు అభివాదం చేస్తూ, అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రోగ్రాంకు హీరోయిన్ రష్మిక మందన కూడా హాజరవడం జరిగిందని, కావున అదనంగా సెక్షన్ 177 మోటార్ వెకిల్ అక్ట్ మరియు హీరోయిన్ రష్మిక మందన పై కేసు నమోదు చేయాలని సంబంధిత చిక్కడపల్లి పోలీస్ వారికి ఈరోజు సీనియర్ న్యాయవాది, వ్యవస్థాపక అధ్యక్షులు సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కొత్తూరు రమేష్ ఫిర్యాదు చేశాడు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!