24-12-2024 NORMAL NEWS 06:51 PM
swarnodayam.com
Telugu Daily News
24-12-2024 06:51 PM By Mandala Yadagiri

మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో పెరియార్ ఈవీ రామస్వామి 51వ వర్ధంతి

మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో పెరియార్ ఈవీ రామస్వామి 51వ వర్ధంతి
IMG_20241224_184908

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో పెరియార్ ఈవీ రామస్వామి 51వ వర్ధంతి హ్యూమనిస్ట్ హౌస్ విజ్ఞాన వికాస కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పెరియార్ ఇవి రామస్వామికి నివాళులు అర్పిస్తూ ఘనంగా నినాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరియర్ ఇవి రామస్వామి చేసినటువంటి ప్రచారాలు ఆయన యొక్క ఆశయాలు చాలా చక్కగా వివరించారు. పెరియర్ ఇవి రామస్వామి బ్రాహ్మణీయ భావజాలాన్ని కులం, మతాల పేరుతో మనుషులను విడదీయరాదని, భారతదేశంలోని మనుషులంతా ఒకటే అని, ప్రజలకు ప్రజలందరూ మనిషిని మనిషిగా గౌరవించే సమాజం కోసం పనిచేయాలని కోరారు. మూఢనమ్మకాలను నమ్మవద్దని మనుషుల యొక్క నమ్మకాన్ని ఆసరా చేసుకొని బాబాలు స్వాములు భూత వైద్యులు స్వామీజీలు మోసం చేస్తూ ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీస్తారని ప్రజలకు అలాంటివి నమ్మకూడదని పిలుపునిచ్చారు. సమాజం మార్పు కోసం తన చిన్నతనం నుండి శాస్త్రీయ భావజాలంతో ముందుకు నడుస్తూ ప్రజలకు మూఢనమ్మకాలు ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ అవగాహన కల్పించేవారన్నారు. కులం పునాదుల మీద ఒక జాతిని గాని నీతిని గాని నిర్మించలేము అనీ పెద్దలు చెప్పినట్టు దేశ ఆర్థిక అభివృద్ధి జరగాలంటే కులాలు మతాలు లేని సమాజం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అంటరానితనంపై కూడా అనేక పోరాటాలు చేయడం జరిగిందన్నారు. జ్ఞానం పొందడానికి మంచి చదువులు చదివి విజ్ఞానం పొంది అజ్ఞానం విడాలని అప్పుడే సమాజ మార్పు జరుగుతుందని కోరారు.

ఈ కార్యక్రమంలో మానవ వికాస వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సభ అధ్యక్షత వహించగా, మానవ వికాస వేదిక కరీంనగర్ జిల్లా అధ్యక్షులు భోగం రమేష్ మరియు బొల్లారం చంద్రమౌళి హనుమకొండ జిల్లా వారు పూలదండ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిత్ర సంఘాల నాయకులు పాల్గొని సందేశము ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్ కలకోటి వెంకటేష్, ఉపాధ్యక్షుడు కొంకటి స్వామి, పెరిక సుందరయ్య కోశాధికారి హనుమకొండ జిల్లా, మిడిదొడ్డి రాజు మానవ వికాస వేదిక సభ్యులు, మోలుగురి ప్రభాకర్ మాజీ జెడ్పిటిసి హుజురాబాద్, కొత్తూరు రమేష్ మానవికాస వేదిక సభ్యులు &అడ్వకేట్, పాక సతీష్ అంబేద్కర్ సంఘ నాయకులు, బొడ్డు సంజీవ్ అంబేద్కర్ సంఘ నాయకులు, కాలువల మల్లయ్య అంబేద్కర్ సంఘ నాయకులు, బి శ్రీనివాస్ అంబేద్కర్ సంఘ నాయకులు, ఆర్ రవితేజ అంబేద్కర్ సంఘ నాయకులు, సిహెచ్ శ్రీనివాస్ అంబేద్కర్ సంఘ నాయకులు, ఉమా మహేష్ సోషల్ వర్కర్, ఎం శ్రీనివాస్ అంబేద్కర్, జి రవీందర్ అంబేద్కర్ సంఘం నాయకులు, వి విజయ్ సోషల్ వర్కర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!