24-12-2024 NORMAL NEWS 06:59 PM
swarnodayam.com
Telugu Daily News
24-12-2024 06:59 PM By Mandala Yadagiri

ఇందిరపార్క్ ధర్నాను విజయవంతం చేయండి.. -టీపీటీఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గుంటి ఎల్లయ్య డిమాండ్.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:- కేజీబీవీ, యూఆర్ ఎస్ సమగ్రశిక్ష ఉద్యోగులు న్యాయపరమైన సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 10వ తారీఖు నుండి నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన నీరసననను మరింత ఉదృతం చేసేందుకై టీపీటీఫ్ ఆధ్వర్యములో డిసెంబర్ 26వ తారీఖున ఇందిరాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడడం జరుగుతుందని ఈ ధర్నాను విజయవంతం చేయడానికి ఉపాధ్యాయులు, సమగ్రశిక్ష ఉద్యోగులు, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు వేల సంఖ్యలో తరలిరావాలని టి పి టి ఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గుంటి ఎల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కస్తూరిభా పాఠశాలలు ఏర్పాటుచేసి అందులో బోధన, భోధనేతర సిబ్బందితో వెట్టిచాకిరి చేయిస్తున్నారని, గురుకుల పాఠశాల మాదిరిగా వీరికి సర్వీస్ రూల్స్ ను రూపొందించి ఇతర ప్రభుత్వ ఉపాధ్యాయులకు వర్తించే అన్నిరకాల సౌకార్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో జరిగిన ధర్నా సన్నద్దత సమావేశములో వారు పాల్గొని మాట్లాడారు. సమగ్రశిక్ష ఉద్యోగులందరిని విద్యాశాఖలో విలీనం చేసి, కాంట్రాక్టు వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో సైదాపూర్, శంకరపట్నం మండల ప్రధాన భాద్యులు మరియు జి చంద్రమౌళి, బి శ్రీధర్, కె తిరుపతి, పి సంజీవయ్య, ఈ సంపత్ కుమార్, కె అన్నపూర్ణ, యం. రవీందర్, పి. తిరుపతి, ch రామకృష్ణ, N సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!