25-12-2024 NORMAL NEWS 04:24 PM
swarnodayam.com
Telugu Daily News
25-12-2024 04:24 PM By Mandala Yadagiri

ఘనంగా భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపాయి జయంతి వేడుకలు

ఘనంగా భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపాయి జయంతి వేడుకలు
IMG-20241225-WA0125

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ జయంతి, హుజూరాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని అటల్ జీ ఈ దేశానికి అందించిన సేవలు అనిర్వచనీయం అని కొనియాడారు.
అటల్ జీ ఆశయ సాధనలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిమగ్నం కావాలని కోరారు. పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంటెరియన్ గా ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఐక్యరాజ్య సమితిలో భారతదేశ ప్రజాప్రతినిధిగా వెళ్లి ఈ దేశానికి సేవలందించడం గొప్ప విషయం అన్నారు. గొప్ప కవిగా విద్యావేత్తగా ఎన్నో సేవలు ఈ దేశానికి అందించారన్నారు. అణు పరీక్షలు నిర్వహించి శత్రు దేశాలకు వణుకు పుట్టేలా చేశారని గుర్తు చేశారు. గ్రామ సడక్ యోజన పేరుతో ప్రతి పల్లెకు రోడ్డుని తీసుకువచ్చి పక్క రాష్ట్రాలతో అనుసంధానం చేశారన్నారు. దమ్మక్కపేట గ్రామంలో 3kmల మేర గ్రామీణ సడక్ యోజన స్కీమ్ లో రోడ్డు నిర్మాణం జరిగిందని, ఆ రోడ్డు నందే ఈరోజు వారి చిత్ర పటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించటం జరిగిందన్నారు. ఇలా ఎన్నో రకాల సేవలందించి ఈ దేశాన్ని శక్తివంతమైనదిగా తయారు చేయడంలో అటల్ జీ ఒకరని కొనియాడారు. అటల్ జీ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నాయకులు, కార్యకర్తలు నిమగ్నం కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పైళ్ల వెంకటరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శిలు తూర్పాటి రాజు, వోడ్నాల విజయ్, సీనియర్ నాయకులు మంచికట్ల సదానందం, కొలిపాక శ్రీనివాస్, నరాల రాజశేఖర్, మొలుగురి నగేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు రావుల వేణు, పట్టణ ఉపాధ్యక్షులు యాంసాని శశిధర్, అంకతి వాసు, తిప్పబత్తిని రాజు, యాల్ల సంజీవరెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు బోరగల సారయ్య, గంట సంపత్, వోడ్నాల చంద్రిక, ఆదర్శ రైతు గూడూరి మల్లారెడ్డి, ముచ్చ సమ్మిరెడ్డి, మాజీ సర్పంచ్ పల్లె వీరయ్య, బూత్ అధ్యక్షులు అపరాధ రమణ, మోలుగూరి రాజు, తాళ్లపల్లి దేవేంద్ర, మొలుగురి అపర్ణ, స్వర్ణలత, కుసుమ సమ్మయ్య, హరీష్, విక్రమ్, బొడ్డు మహేష్, గోవిందుల అజయ్, మండల నాయకులు మర్రి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!