Social 1080×1350 • Multi-page
25-12-2024 BREAKING NEWS 06:15 PM
swarnodayam.com
Telugu Daily News

పశుగణ అభివృద్ధికి గోపాలమిత్రల సేవలు మరువలేనిది..గోపాల మిత్రుల సమస్యలు పరిష్కరిస్తాం.! -మంత్రి పొన్నం ప్రభాకర్

పశుగణ అభివృద్ధికి గోపాలమిత్రల సేవలు మరువలేనిది..గోపాల మిత్రుల సమస్యలు పరిష్కరిస్తాం.! -మంత్రి పొన్నం ప్రభాకర్
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ (సైదాపూర్): డిసెంబర్ 25: కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి చెందిన ఆకునూరు గోపాలమిత్ర సెంటర్ తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్ గోపాలమిత్ర వీధుల నిర్వహణలో పేరుకపల్లె గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తన వాహనాన్ని ఆపి తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్ ను గోపాల మిత్రుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోపాల మిత్రుల పశుగణ అభివృద్ధికి కృషి చేయాలని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గోపాల మిత్రుల సమస్యలను పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పారు. వ్యవసాయంతో పాటు రైతులు పాడి రైతులు పాడి పరిశ్రమను పెంపొందించుకోవాలని, రైతులు అభివృద్ధి చెందే దిశగా నడవాలి అని కోరారు. అనంతరం గోపాలమిత్ర ఆకునూరు సెంటర్ తాళ్లపెళ్లి శ్రీనివాస్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ శాలువా కప్పి అభినందించారు. గోపాలమిత్ర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు తాళ్లపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!