25-12-2024 NORMAL NEWS 09:29 PM
swarnodayam.com
Telugu Daily News
25-12-2024 09:29 PM By Mandala Yadagiri

వితంతువులకు చీరల పంపిణీ చేసిన ప్రవీణ్ దంపతులు

వితంతువులకు చీరల పంపిణీ చేసిన ప్రవీణ్ దంపతులు
IMG-20241225-WA0235

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని బిలివర్ చర్చ్ లో పాస్టర్ నవీన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేయగా, దళిత నాయకుడు బోరగాల ప్రవీణ్-వాణి దంపతులు సొంతంగా పదిమంది వితంతువులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు సూచించిన శాంతి, ప్రేమ, సత్య మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని ప్రవీణ్ దంపతులు పేర్కొన్నారు. ఏసుక్రీస్తూ ఏర్పరిచిన సత్యమార్గం, నీతి మార్గం అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు, బిజెపి నాయకుడు నల్ల సుమన్ తదితరులు పాల్గొన్నారు.

వితంతు మహిళలకు పండుగను పురస్కరించుకొని చీరలను అందజేస్తున్న ప్రవీణ్ దంపతులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!