26-12-2024 NORMAL NEWS 01:29 PM
swarnodayam.com
Telugu Daily News
26-12-2024 01:29 PM By Mandala Yadagiri

సీఎం రేవంత్ తో సమావేశమైన సినీ ప్రముఖులు..!.. పలు అంశాలపై చర్చించిన ఇరు వర్గాలు

సీఎం రేవంత్ తో సమావేశమైన సినీ ప్రముఖులు..!.. పలు అంశాలపై చర్చించిన ఇరు వర్గాలు
IMG_20241226_132403

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు గురువారం సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ చర్చలలో పలువురు పలు అంశాల గురించి సీఎం దృష్టికి తీసుకురాగా ఆ విషయాలు వారి మాటల్లోనే ఈ విధంగా ఉన్నాయి.

  • అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు – రాఘవేంద్రరావు
  • ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది..
  • దిల్‌ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా..
  • తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌లు ఉన్నాయి -రాఘవేంద్రరావు
  • గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో చేశారు..
  • ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను..
    హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం – రాఘవేంద్రరావు
  • యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలి – నాగార్జున
  • ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే..
    సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది – నాగార్జున
  • హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక – నాగార్జున
  • చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు- శ్యాంప్రసాద్‌ రెడ్డి
  • ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవన్న సీఎం
  • ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పిన సీఎం రేవంత్‌
  • అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్న రేవంత్‌
  • ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుంది -మురళీమోహన్‌
  • సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది- మురళీ మోహన్
  • సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది- మురళీమోహన్‌
  • ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ ఉండడం వల్ల..
    ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం – మురళీమోహన్‌
  • నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను – శ్యాంప్రసాద్‌రెడ్డి
  • హైదరాబాద్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లాలి – శ్యాంప్రసాద్‌రెడ్డి
  • శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్‌
  • ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామన్న సీఎం
  • అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే..!
  • ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చిన సీఎం
  • తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి..
  • డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి..
  • టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి..
  • ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి..

  • ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్న దగ్గుబాటి సురేష్‌బాబు
  • హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ చేయాలనేది డ్రీమ్..
  • ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో..
    చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చింది – సురేష్‌బాబు
  • నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు..
    హైదరాబాద్‌ కేరాఫ్‌గా ఉండాలి – సురేష్‌బాబు
  • మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చింది – త్రివిక్రమ్‌
  • ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చిన సీఎం
  • సంధ్య థియేటర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం
    — ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే..తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందన్న సీఎం రేవంత్‌

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!