Social 1080×1350 • Multi-page
26-12-2024 BREAKING NEWS 06:08 PM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దొంత రమేష్

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దొంత రమేష్
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుఢు వేం నరేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు(గురువారం) వారి స్వగృహంలో టిపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి తిరుమల శ్రీవారి పట్టు వస్త్రాలు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దొంత రమేష్ మాట్లాడుతూ అప్పుల్లో కూరుకుపోయి తీవ్ర ఆర్థిక లోటు లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో పెద్దలు వేం నరేందర్ రెడ్డి సలహాలు, సూచనలతో ప్రగతి పథంలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది అని, వారు చేపట్టిన ఈ పదవికి తగిన న్యాయం చేస్తున్నారని చేపట్టిన ఈ పదవికి వన్నె తీసుకువచ్చారని అన్నారు. ఈ సందర్భంగా వారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు వారి స్వగృహంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు. భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు తెలంగాణ ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దోమ్మటి వెంకటేశ్వర్లు ఉన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!