Social 1080×1350 • Multi-page
26-12-2024 BREAKING NEWS 11:26 PM
swarnodayam.com
Telugu Daily News

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు, – ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేనివి. -పోలాడి రామారావు.

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు, – ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేనివి. -పోలాడి రామారావు.
IMG_20241226_232517

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: భారత మాజీ ప్రధాని , ప్రముఖ ఆర్థిక వేత్త, డాక్టర్ మన్మోహన్ సింగ్ అనారోగ్యం తో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ లో మృతి చెందడం బాధాకరమని, దేశానికి తీరని లోటని, దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి,రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి విశేష సేవలు అందించి, ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం తీసుకు రావడం గొప్ప విజయమని రామారావు అన్నారు.
కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ లో అర్థిక శాస్త్రం లో డాక్టరేట్ అందుకొని ప్రముఖ ఆర్థిక వేత్త గా దేశానికి అనేక సేవలు అందించి, దేశం అర్థిక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వంలో అర్థిక మంత్రిగా చేరి అనేక అర్థిక సంస్కరణలు తీసుకు వచ్చి అమలు చేసి అర్థిక సంక్షోభం నుంచి గట్టుక్కించి దేశానికి ఎంతో మేలు చేశారని, ఆ తర్వాత 10 ఏళ్లు ప్రధానిగా దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు మరువలేనివని
ఆయన మరణం బాధాకరమని పోలాడి రామారావు తీవ్ర విచారం వ్యక్తం చేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!