Social 1080×1350 • Multi-page
27-12-2024 BREAKING NEWS 01:29 PM
swarnodayam.com
Telugu Daily News

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు వొడితల…ప్రణవ్.

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు వొడితల…ప్రణవ్.
IMG-20241227-WA0125

–ఆర్థిక వేత్తగా అనేక సేవలు.

–తెలంగాణ ఏర్పాటు విషయంలో కృషి చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ చేసిన కృషి రాష్ట్ర ప్రజల మదిలో ఎల్లవేళలా ఉంటుందని, దేశానికి ఆర్థిక క్రమశిక్షణ నేర్పిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి మరణం దేశానికే తీరని లోటు అని అన్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో సగటు పేదవాడికి కావలసిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ విధంగా పథకాలను రూపొందించారని అన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!