Social 1080×1350 • Multi-page
27-12-2024 BREAKING NEWS 06:52 PM
swarnodayam.com
Telugu Daily News

మన్మోహన్ సింగ్ కి కాంగ్రెస్ నేతల ఘన నివాళి.

మన్మోహన్ సింగ్ కి కాంగ్రెస్ నేతల ఘన నివాళి.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశ మాజీ ప్రధానమంత్రి దివంగత నేత మన్మోహన్ సింగ్ అకాల మరణానికి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఈరోజు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సాయంత్రం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి హుజురాబాద్ పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ప్రధానిగా ఉన్న రోజుల్లో మన్మోహన్ సింగ్ ప్రజలకు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరి స్వామిరెడ్డి, వడ్లూరి విజయ్ కుమార్, హుజురాబాద్ హనుమాన్ టెంపుల్ చైర్మెన్ కొలిపాక శంకర్, లంకదాసరి లావణ్య, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, యేముల పుష్పలత, ఆలేటి సుశీల, యండి అఫ్సర్, ఎర్ర రవీందర్, ఎర్ర రమేష్, ఉప్పు శ్రీనివాస్ పటేల్ , యండి చాంద్ పాషా, గంట కిరణ్ రెడ్డి, కొడం రజిత, యండి ఇమ్రాన్, పుల్ల రాధ, ప్రవీణ్, కన్నబోయిన శ్రీనివాస్, తిరుపతి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు గోస్కుల నాగమణి, యూత్ కాంగ్రెస్ నాయకులు మేకల రాజుకుమార్, జీ జమదగ్ని, మధుకర్, యండి సాదిక్, బుర్ర రేణుకా, నర్సింగ్, ఐలయ్య, మోరె తిరుపతి, యండి రియాజ్, గడ్డం రాఘవేంద్ర కుమార్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!