Social 1080×1350 • Multi-page
27-12-2024 BREAKING NEWS 11:27 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్ పట్టణంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురికి తీవ్ర గాయాలు

హుజూరాబాద్ పట్టణంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురికి తీవ్ర గాయాలు
IMG_20241227_232527

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నాయి. పట్టణం లోనీ రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద డివైడర్ ను ఢీకొనీ బైక్ ను ఢీకొన్న బొలెరో వాహనం. ఒకరికి తీవ్ర గాయాలు మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే క్షతగాత్రులు చెల్పూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీస్ లు. అలాగే పర్కాల్ క్రాస్ రోడ్డు వద్ద టాటా మ్యజిక్ ను బైక్ ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయాలైన వారిని వరంగల్ హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీస్ లు. క్షతగాత్రులను జుపాక గ్రామానికి చెందిన కొండపాక సుమన్ ,పంజాల భరత్ గా గుర్తించిన పోలీసులు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!