Social 1080×1350 • Multi-page
28-12-2024 BREAKING NEWS 05:35 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హుజురాబాద్ లో ఘనంగా ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎస్ఎఫ్ఐ హుజురాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాకతీయ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పొడిశెట్టి అభిలాష్ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో ఉన్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలనీ, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం అయినా మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనూక ప్రభుత్వం తక్షణమే కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై హుజూరాబాద్ లో రానున్న రోజుల్లో అనేక ఉద్యమాలు చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అజయ్, అరవింద్, లోకేష్, శ్రీకాంత్, రాజకుమార్, వెంకటేష్, నవీన్ పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!