Social 1080×1350 • Multi-page
29-12-2024 BREAKING NEWS 09:49 AM
swarnodayam.com
Telugu Daily News

ఇందిరానగర్ లో ఘనంగా వీర్ బాల్ దివస్క

ఇందిరానగర్ లో ఘనంగా వీర్ బాల్ దివస్క
IMG_20241229_094803

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : సిక్కుల పదవ గురువు అయిన శ్రీ గురు గోవింద్ సింగ్ యొక్క నలుగురు కుమారులు పెద్దవారు ఇద్దరు యుద్ధంలో వీర మరణం పొందగా, చిన్న వాళ్ళిద్దర్నీ మొఘల్ రాజు సజీవ సమాధి చేశాడు. ధర్మం కోసం సత్యం కోసం పోరాడి వీర మరణం పొందిన వాళ్లకోసం ఈరోజు వీర్ బాల్ దివస్క జరుపుకుంటున్నామని సికిలిగర్ సమాజ్ హుజురాబాద్ 13వ వార్డు ఇందిరానగర్ మత పెద్దలు తెలిపారు. వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. నాడు దేశం కోసం సిక్కు మత సమాజం కోసం వారు చేసిన వీరోచిత పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సికిలిగర్ సమాజ్ హుజురాబాద్ 13వ వార్డు ఇందిరానగర్ మత పెద్దలు సర్దార్ గోపాల్ సింగ్, సర్ధార్ హతీయర్ సింగ్, సర్దార్ ధ్యాల్ సింగ్, సర్దార్ ధర్మెందర్ సింగ్, చతర్ సింగ్, హీరా సింగ్, ఏ హీరా సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!