Social 1080×1350 • Multi-page
29-12-2024 BREAKING NEWS 12:30 PM
swarnodayam.com
Telugu Daily News

రాష్ట్రంలో ఇద్దరు ఖాకీల ఆత్మహత్యలు..అదుపు తప్పుతున్న పోలీసుల మనోదైర్యం

రాష్ట్రంలో ఇద్దరు ఖాకీల ఆత్మహత్యలు..అదుపు తప్పుతున్న పోలీసుల మనోదైర్యం
IMG-20241229-WA0089

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్, డిసెంబర్ 29: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య..మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోజు తెల్లవారుజామున వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్వార్టర్ ఆవరణలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్మ చేసుకున్నారు.


సిద్దిపేటలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ తన కుటుంబ సభ్యులకు విషమిచ్చి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు విషమిచ్చిన తర్వాత తాను విషం తాగి అనంతరం ఉరి వేసుకుని చనిపోయాడు. భార్య, పిల్లల పరిస్థితి విషమం ఉంది. కాగా, భార్య, పిల్లలు అపస్మారక స్థితిలో ఉండటం చూసి స్థానికులు వారిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండు సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల మనోధైర్యం అదుపుతప్పడం ఒకేసారి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఆత్మహత్య చేసుకోవడం పోలీసు వ్యవస్థలో పలువురి ఆత్మ ధైర్యాన్ని కుంగ తీస్తుంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!