Social 1080×1350 • Multi-page
29-12-2024 BREAKING NEWS 05:55 PM
swarnodayam.com
Telugu Daily News

శాలపల్లిలో ఘనంగా నేతన్న విగ్రహ ప్రథమ వార్షికోత్సవము

శాలపల్లిలో ఘనంగా నేతన్న విగ్రహ ప్రథమ వార్షికోత్సవము
IMG_20241229_175254

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం శాలపల్లి గ్రామంలో నేతన్న విగ్రహము ప్రథమ వార్షికోత్సవము శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చేనేత పద్మ సమైక్య రాష్ట్ర వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ జడల చిరంజీవి మాట్లాడుతూ చేనేత కుటుంబాలను చేనేత భీమాను మరియు వారికి ఉపాధి కల్పించే విధంగా ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి అయ్యేవిధంగా చేనేత వస్త్రాలను మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత కార్మికులకు జీవనోపాధి కల్పించాలన్నారు. అదేవిధంగా సిరిసిల్లలో గత సంవత్సరం కాలంలో 36 చేనేత మరణాలు జరిగాయని వారి కుటుంబానికి మన ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందే విధంగా నాయకులు చర్యలు చేపట్టాలని సంఘ నాయకులకు జడల చిరంజీవి తన ఆవేదనను వ్యక్తం చేశారు. కొంతమంది నాయకులమని చెప్పుకుంటూ తిరుగుతున్న సంఘ నాయకులారా మన చేనేత కార్మికుల దుస్థితి మన ప్రభుత్వాన్నికి చేరేలా మీరు ప్రయత్నం చేయాలని కోరారు. స్టేజ్ మీదనే కులమే బలం బలమే కులముగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఓ సంఘ నాయకులారా ఈ ఆకలి చావులు వినబడుతలేవా.. అన్ని సంఘాలు ఒక తాటిగా వచ్చి చేనేత కార్మికులను మన పద్మశాలి బిడ్డలను కాపాడుకునే విధంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమానికి గుండేటి దేవయ్య, చిలకమర్రి శ్రీనివాస్, సంగెం సత్యనారాయణ, లింగమూర్తి, గ్రామ పద్మశాలి అధ్యక్షుడు వేముల రమేష్, జడల సదాశివ, మెరుగు నగేష్, మషం సత్యం, దుస శ్రీనివాస్, ఆడెపు పోచమల్లు, గుత్తికొండ అంజయ్య, కొక్కుల శంకరయ్య, రాజేశం, జడల సుధాకర్, వేముల భూపతి, జడల పోషములు, కొక్కుల శ్రీనివాస్, మరియు మహిళాలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!