29-12-2024 NORMAL NEWS 06:28 PM
swarnodayam.com
Telugu Daily News
29-12-2024 06:28 PM By Mandala Yadagiri

అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా.. – తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మునగాల మణిపాల్ రెడ్డి

అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా.. – తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మునగాల మణిపాల్ రెడ్డి
IMG_20241229_182520

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం రాష్ట్ర సంఘ అధ్యక్షులు మునగాల మణిపాల్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం తోట రాములు ఫంక్షన్ హాల్ కరీంనగర్ లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏరుకొండ నరసింహ స్వామితో పాటు 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఏరుకొండ నరసింహస్వామి ప్రధాన కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టాగా సభ్యులందరూ కరతాలధ్వనులతో ఆమోదించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సంఘ అధ్యక్షులు మునగాల మణిపాల్ రెడ్డి మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ,విద్యారంగ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జూలై 2023 నుండి అమలు కావలసిన పిఆర్.సి ఇప్పటికీ 18 మాసాలు ఆలస్యం అయిందని వెంటనే పిఆర్సి కమిటీ నుండి నివేదిక తెప్పించుకొని పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలలో కనీసం రెండు డిఏలను ప్రకటించడంతోపాటు పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా 42% ఫిట్మెంట్ ప్రకటించి పిఆర్సీ అమలుపరచాలని అన్నారు. గత 20 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగుల డిమాండ్ల పై ప్రభుత్వం స్పందించాలని వెంటనే చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఆదర్శ పాఠశాలలను పాఠశాల విద్యా డైరెక్టరేట్ లో విలీనం చేస్తూ 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లింపు చేయాలని అన్నారు. అన్ని కేజీబీవీ పాఠశాలల్లో కేర్ టేకర్లను నియమించాలని అన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి మండల విద్యాధికారులుగా, జూనియర్ లెక్చరర్లుగా మరియు డైట్ లెక్చరర్ లు గా పదోన్నతులు కల్పించాలని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలుపరచడానికి ముందు అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు స్వీకరించాలని కోరారు. 317జీవోపై సబ్ కమిటీ చేసిన సిఫార్సులు స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులందరూ భవిష్యత్తులో తమ సొంత జిల్లాకు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని అన్నారు.

సమావేశ అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా మునగాల మణిపాల్ రెడ్డి, రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లి పరిష్కారం అయ్యేలా తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర సంఘ పక్షాన కృషి చేస్తామని, ఉపాధ్యాయులందరికీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని, తమపై విశ్వాసముంచి రాష్ట్ర సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అవకాశాన్ని కల్పించినందుకు 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు,సీనియర్ కార్యకర్తలకు మరియు ప్రాథమిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు పటోళ్ల బలవంత్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సోగల సుదర్శన్, మహబూబ్ నగర్ జిల్లా శాఖ అధ్యక్షులు జుర్రు నారాయణ, పెద్దపెల్లి జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కనుమల్ల రవికుమార్, మహమ్మద్ మన్సూర్, కరీంనగర్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి గంప చంద్రశేఖర్, కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండి ముజీబుద్దిన్ మరియు కాంబ్లి గోపాల్, మోహన్, రమేష్, ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!