Social 1080×1350 • Multi-page
29-12-2024 BREAKING NEWS 09:28 PM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా కుడికాల సాయి

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా కుడికాల సాయి
IMG_20241229_212718


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హిదరాబాదులోని ధనుంజయ గార్డెన్ లో ఆదివారం తెలంగాణ చేనేత వేదిక పద్మశాలి సంఘం 2024-2029 ఐదు సంవత్సరాల గాను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన హుజురాబాద్ పట్టణానికి చెందిన కుడికాల సాయి ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా పద్మశాలి కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సాయం చేస్తూ పద్మశాలీల అభ్యున్నతి కోసం పాటుపడుతూ సేవలు అందిస్తున్నానని, అంతేకాకుండా పద్మశాలి సంఘం కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పద్మశాలి సంఘానికి సేవలు చేస్తూనానని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా పద్మశాలీలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వారికి అండగా ఉంటానన్నారు. తనను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక చేసిన రాష్ట్ర నాయకులకు సాయి కృతజ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!