Social 1080×1350 • Multi-page
29-12-2024 BREAKING NEWS 10:13 PM
swarnodayam.com
Telugu Daily News

సైదాపూర్ మండల విలేకరుల సమస్యలు పరిష్కారం చేయాలి

సైదాపూర్ మండల విలేకరుల సమస్యలు పరిష్కారం చేయాలి
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్),డిసెంబర్29: సైదాపూర్ మండలంలో పనిచేస్తున్న విలేకరులకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేవని టీయూడబ్ల్యూజే-ఐజేయూ ఈసీ మెంబర్ సారబుడ్ల రాజిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ ప్రెస్ భవనంలో కరీంనగర్ ఈసీ తొలి సమావేశం అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈసందర్భంగా ఈసీ సమావేశంలో పాల్గొన్న ఈసీ మెంబర్ సారబుడ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఇప్పటివరకు సైదాపూర్ మండల విలేకరులు ఎలాంటి లబ్ధి పొందలేదని తన ఆవేదన సభా దృష్టికి తీసుకెళ్లారు. సైదాపూర్ మండలం హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్నందున కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, హనుమకొండ జిల్లా పరిధిలో ఉన్నందున మాకు హుజురాబాద్ కానీ హుస్నాబాద్ లోనైనా ఇంటి స్థలం ఇప్పించాలని రాష్ట్ర, జిల్లా సంఘం నాయకులు సైదాపూర్ మండలంపై ప్రత్యేక దృష్టి సారించాలని సారబుడ్ల రాజిరెడ్డి కోరారు. టీయూడబ్ల్యూజే-ఐజేయూఅధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, కార్యదర్శి కే.చంద్రశేఖర్, జాతీయ కార్యవర్గ సభ్యులు శేఖర్, రాష్ట్ర హెల్త్ కమిటీ బల్మూరి విజయసింహారావు, జే.మారూతి, నర్సింగోజు మహేంద్రచారీ, కార్యవర్గ సభ్యులు తదితర మండలాల విలేకరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!