30-12-2024 NORMAL NEWS 07:17 PM
swarnodayam.com
Telugu Daily News
30-12-2024 07:17 PM By Mandala Yadagiri

ఐకమత్యంతో సగరుల అభివృద్ధికి కృషి చేయాలి- సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర

ఐకమత్యంతో సగరుల అభివృద్ధికి కృషి చేయాలి- సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర
IMG_20241230_191431

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ డిసెంబర్ 30: సగరులు ఐకమత్యంతో పని చేస్తూ, వారి ఆర్ధిక అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఆదివారం సగర సంఘం కార్యవర్గ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సగరులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, సగరుల సమస్యలపై ప్రభుత్వాలపై పోరాటం చేసేందుకు ఐకమత్యంతో ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికలు అనగానే ఎవరూ కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా సోదర భావంతో తీసుకుని ఎన్నికల అనంతరం అందరూ ఐకమత్యంగా పనిచేస్తూ సగరుల అభివృద్ధిని ఆంకాంక్షిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడిగా దేవునూరి శ్రీనివాస్ సగర, ప్రధాన కార్యదర్శిగా కట్టరాజు సగర, కోశాధికారిగా కాటిపెల్లి కుమారస్వామి సగర గెలుపొందారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర సంఘం గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికిషన్, ప్రధాన కార్యదర్శి గౌరక్కు సత్యం సగర, కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర, ఉపాధ్యక్షుడు నలుబాల భిక్షపతి సగర, కార్యనిర్వాహణ కార్యదర్శి కానిగంటి శ్రీనివాస్ సగర, మహిళా విభాగం అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి సగర, యువజన విభాగం అధ్యక్షుడు మర్క సురేష్, ప్రధాన కార్యదర్శి ఉప్పరి మహేందర్ సగర, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమళ్ళ కుమారస్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు బొడిపెల్లి కొటేశ్వర్ నగర, కురిమిండ్ల రాజు సగర, నలుబాల మధు సగర, సీనియర్ నాయకులు ఏరుకొండ ప్రసాద్ సగర, నలుబాల మురళి సగర, దేవునూరి శ్రీనివాస్ నగర్, గుంటి శ్రీనివాస్ సగర, నలుబాల వేణు సగర తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!