30-12-2024 NORMAL NEWS 07:30 PM
swarnodayam.com
Telugu Daily News
30-12-2024 07:30 PM By Mandala Yadagiri

నాగార్జున డైరీని సందర్శించిన మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యార్థులు

నాగార్జున డైరీని సందర్శించిన మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యార్థులు
IMG_20241230_192831

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, డిసెంబర్30: బోర్నపల్లి గ్రామ శివారులో గల మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు సోమవారం ఫీల్డ్ విజిట్లో భాగంగా పట్టణంలోని పరకాల క్రాస్ వద్ద గల నాగార్జున డైరీ ఫార్మ్, నాగార్జున సీడ్ ప్రాసెసింగ్ యూనిటు సందర్శించారు. అక్కడి సిబ్బంది పాల డైరీ పని తీరు, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ పనితీరును విద్యార్థులకు వివరించారు. మెషినరీపై విద్యార్థులకు కలిగిన అనుమానాలను అక్కడి సిబ్బంది నివృత్తి చేశారు. ఫీల్డ్ విజిల్స్లో భాగంగా పాలడైరీని, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించడం సంతృప్తి నిచ్చిందన్నారు. విద్యార్థి దశలోనే ఇండస్ట్రీల పట్ల అవగహన కల్పించడం ద్వారా విద్యార్థుల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని, విద్యార్థులు తను ప్లాంట్ను సందర్శించేలా కృషి చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ సంపలకు నాగార్జున డైరీ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఆకినపల్లి ప్రవీణ్, నాగార్జున డైరీ డైరెక్టర్ పీ గణేష్ రావు, ఏజీఎం సుధాకర్, మేనేజర్ వీ శ్రీనివాస్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!