Social 1080×1350 • Multi-page
31-12-2024 BREAKING NEWS 01:45 PM
swarnodayam.com
Telugu Daily News

రాజమౌళి సేవలు మరువలేనివి.. ఘనంగా జొంగోని రాజమౌళి పదవీ విరమణ వేడుకలు

రాజమౌళి సేవలు మరువలేనివి.. ఘనంగా జొంగోని రాజమౌళి పదవీ విరమణ వేడుకలు
IMG_20241231_133059

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: టీజీఎస్ ఆర్టీసీలో హుజురాబాద్ డిపో పరిధిలో డ్రైవర్ గా సేవలందించి పదవీ విరమణ పొందిన మండలంలోని జూపాకకు చెందిన జొంగొని రాజమౌళి సేవలు ఆర్టీసీ ఎన్నటికీ మరువలేదని హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. గత 30 సంవత్సరాలుగా ఆర్టీసీలో డ్రైవర్ గా సేవలందించిన రాజమౌళి మంగళవారం పదవీ విరమణ గావించారు. ఈ సందర్భంగా జోంగోని రాజమౌళిని డిఎం రవీంద్రనాథ్, హెడ్ క్లర్కు నజీరుద్దీన్, ఏ డీసీలు అల్లకొండ బాపురెడ్డి, టీ సమ్మిరెడ్డి, ఎంసీ పంజాల శ్రీనివాస్ తదితరులు రాజమౌళికి పూలమాలలు వేసి శాలువాలు కప్పి జ్ఞాపకం అందజేసి ఘనంగా సత్కరించారు. ఆర్టీసీలో ప్రమాద రహిత డ్రైవర్ గా 30 ఏళ్లుగా పలు డిపోలలో సేవలు అందించి ఎందరో అధికారుల మన్ననలు పొందిన రాజమౌళి సేవలను ఆర్టీసీ సంస్థ ఎల్లవేళలా గుర్తుంచుకుంటుందని ఈ సందర్భంగా పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి అధికారులు, సిబ్బందితో పాటు రాజమౌళి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

పదవీ విరమణ పొందిన దొంగోని రాజమౌళిని డిఎం రవీంద్రనాథ్ ఇతర అధికారులు సత్కరించి అభినందిస్తున్న దృశ్యంలు

————————————-+———————

  • పత్రిక ప్రకటనలు*
  • ——————+

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!