Social 1080×1350 • Multi-page
01-01-2025 BREAKING NEWS 12:44 AM
swarnodayam.com
Telugu Daily News

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం..రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం..రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు
IMG-20250101-WA0011

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మరికొద్ది క్షణాల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారన్న ఆనందం ఆ ఇద్దరు యువకుల్లో డ్యూటీలో ఆనందం చేజారి విషాదన్ని మిగిలించింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ దంపతుల కుమారుడు మణిదీప్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు కేకు తీసుకునేందుకు ద్విచక్ర వాహనంపై అంబేద్కర్ చౌరస్తా వద్దకు రాగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడైన యువకుడు గంజాయి మత్తులో నిర్లక్ష్యంగా వచ్చి కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై మణిదీప్ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో మణిదీప్ రోడ్డుపై పడడంతో తలకు, చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మణిదీపును స్థానికంగా ప్రథమ చికిత్స జరిగిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మణిద్వీపంలో ఢీకొట్టిన యువకుని వద్ద కొంత మోతాదులో గంజాయి ఉన్నట్టు సమాచారం, దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురి కావడం పట్టణంలో పలువురిని విషాదంలోకి నెట్టింది.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గందే మణిదీప్

గంజాయి మత్తులో వచ్చి ఢీ కొట్టిన యువకుడు ఇతడే..!?

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!