01-01-2025 NORMAL NEWS 07:22 PM
swarnodayam.com
Telugu Daily News
01-01-2025 07:22 PM By Mandala Yadagiri

కల్వరిటెంపుల్ లో ప్రత్యేక ఆరాధన, కొత్త సంవత్సర వేడుకలు

కల్వరిటెంపుల్ లో ప్రత్యేక ఆరాధన, కొత్త సంవత్సర వేడుకలు
IMG-20250101-WA0164


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
మండలములోని రంగాపూర్ గ్రామంలో గల కల్వరి టెంపుల్ చర్చిలో నూతన సంవత్సర, ప్రతేక ఆరాధన వేడుకలు జరిగాయి – చర్చ్ ఫాదర్ రెవ. డాక్టర్. పిఆర్ నెల్సన్ ఉదయము నుండే వచ్చిన వారందరికి శుభాకాంక్షలు తెలుపుతూ చర్చిలోకి ఆహ్వానించారు. పిల్లలు, యూత్ నాట్యాలతో ప్రజలను సంతోషపరిచారు. ఈ వేడుకలకు పంచాయితీ సెక్రెటరీ మరియు సమాజసేవకులు బండ ప్రసాద్, కుమారుడు కోడలు సుమన్ – శివాని దంపతులను తీసుకొని కల్పరి టెంపుల్ మందిరానికి హజరయ్యారు. సుమన్ – శివాని దంపతుల మ్యారేజ్ డే ఈ నూతన సంవత్సరం రోజున రావడం వలన ఫాదర్ నెల్సన్ వారితో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొని చర్చి సభ్యులందరికోసం ప్రత్యేకమైన ‘ కేక్ ను కట్ చేసి అందరికి పంచిపెట్టారు. 10 మంది వితంతువులకు చీరలు అందించారు. బండ ప్రసాద్ మాట్లాడుతూ పేదరికములో ఉన్న నన్ను యేసయ్య దీవెనల వలన ఒక మంచి స్థాయికి నన్ను, నా కుటుంభాన్ని దేవుడు ఎంతో దీవించాడని సాక్షమిచ్చారు. ఫాదర్ నెల్సన్ మాట్లాడుడూ తరాలు మారినా, యుగాలు మారినా, శతాబ్దాలు మారినా మనిషే మారడం లేదని, సంవ్సరములు గడుస్తుంటే మరొక కొత్త సంవత్సరము వచ్చిందని సంతోషపడకుండా జీవితంలో ఒక సంవత్సర ఆయుష్షను కల్పోయామని భావించి ప్రతి ఒక్కరు సత్ ప్రవర్తనతో జీవించి ఉన్నదాంట్లో ఇతురులకు సహాయపడాలని భోదించారు. ఈ వేడుకలకు హన్మకొండనుండి డిప్యూటి సూపరెండెంట్ తాళ్ళపేల్లి ఏలిజబేత్ , అమూల్య, విల్సన్, పౌలు, దేవయ్య, చొక్కయ్య, రమేష్, అనిల్, ఆశోక్, ఆశీర్వాదం, సుమలత, పూలమ్మ, హేమ, అరుణ, మాథవి, స్నేహ, ప్రియాంక, విష్ణు, హర్షవర్షన్, కిరణ్ తేజ్ తదితరులు హాజరయారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!