Social 1080×1350 • Multi-page
03-01-2025 BREAKING NEWS 07:36 PM
swarnodayam.com
Telugu Daily News

సావిత్రిభాయి పూలే జీవితం నవతరానికి ఆదర్శం- మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక

సావిత్రిభాయి పూలే జీవితం నవతరానికి ఆదర్శం- మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక
IMG_20250103_193404

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జనవరి 3: ప్రభుత్వం సావిత్రిభాయి పూలే జయంతిని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడంతో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల, సింగాపూర్ గ్రామంలోని వీఎస్ ఆర్ డిగ్రీ కళాశాలతో పాటు పూలే జయంతోత్సవ కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిభాయి పూలే చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని జమ్మికుంట రోడ్డులో నిర్వహించిన వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సావిత్రిభాయి పూలే జీవితం నవతరానికి ఆదర్శమన్నారు. సావిత్రిభాయి పూలే భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా, మహిళల అక్షరాశ్యత కోసం విశేష సేవలందించిందని కొనియాడారు. పూలే దంపతులు లేకుంటే ఆధునిక భారతానికి చదువు అందని ద్రాక్షగానే మిగిలేదన్నారు. ఈ కార్యక్రమాల్లో పట్టణ సీఐ తిరుమల్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సదానందం, టాప్రా జిల్లా అధ్యక్షుడు జనార్ధన్, మున్సిపల్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఖాలీద్ హుస్సేన్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెల్ కన్వీనర్ తిప్పారపు సంపత్, హనుమాన్ టెంపుల్ చైర్మన్ శంకర్, వేల్పుల రత్నం, ప్రధానోపాధ్యాయురాల్లు, ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్, వీఎస్ఆర్ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, విద్యార్ధినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!