06-01-2025 NORMAL NEWS 12:33 PM
swarnodayam.com
Telugu Daily News
06-01-2025 12:33 PM By Mandala Yadagiri

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతికి మిత్రుల ఘన సన్మానం

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతికి మిత్రుల ఘన సన్మానం
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియామకమైన మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన మేకల తిరుపతికి ఆయన మిత్రులు సోమవారం ఘనంగా సన్మానించారు. ప్రముఖ వ్యాపారులు.. తిరుపతి మిత్రులు సంపంగి రాజేందర్ (మైకెల్), మోతే తిరుపతి తదితర మిత్రులు తిరుపతికి శాలువా కప్పి పూలమాలవేసి శుభాకాంక్షలు తెలిపారు. మేకల తిరుపతి భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి అయ్యప్ప సేవా సమితి సభ్యులు, గ్రామస్తులు, ఇతర మిత్రులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!