Social 1080×1350 • Multi-page
06-01-2025 BREAKING NEWS 02:13 PM
swarnodayam.com
Telugu Daily News

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో బోరు నిర్మానంకు ప్రత్యేక పూజ

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో బోరు నిర్మానంకు ప్రత్యేక పూజ
IMG-20250106-WA0084

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని సిద్ధార్థ నగర్ కాలనీలో గల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నిర్మాణ పనులలో భాగంగా వేద పండితుడు పందిళ్ళ భాస్కర్ శర్మ కోరిక మేరకు గణపతి సీడ్స్ మరియు నాగార్జున డైరీ అధినేత పుల్లూరి ప్రభాకర్ రావు ఆలయంలో బోర్ వేయుటకు మరియు మోటార్ బిగించుటకు వారు మాట ఇచ్చి ముందుకు వచ్చారు. అందులో భాగంగా ఈరోజు సోమవారం ఉదయం బోర్ వేసే కార్యక్రమంను ప్రభాకర్ రావు చేతులకు ప్రారంభించారు. ముందుగా భాస్కర్ శర్మ బోర్ వేసే వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడగ్గానే స్పందించి బోర్ మోటార్ వేయిస్తున్న పుల్లూరి ప్రభాకర్ రావుకి వారి కుటుంబానికి శ్రీ లక్ష్మీ గణపతి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని బాలయ్య పూజారి తో పాటు ఆలయ కమిటీ సభ్యులు కోరుకుంటూ వారికి అందరి తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, సిద్ధార్థ నగర్ కాలనీవాసులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!