Social 1080×1350 • Multi-page
07-01-2025 BREAKING NEWS 06:43 PM
swarnodayam.com
Telugu Daily News

కాలం చెల్లిన రబ్బరు సురక్ష రబ్బరు ట్యూబులు వెంటనే మార్చుకోవాలి.. -పివి మదన్ మోహన్ తెలంగాణ వంటగ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి….

కాలం చెల్లిన రబ్బరు సురక్ష రబ్బరు ట్యూబులు వెంటనే మార్చుకోవాలి.. -పివి మదన్ మోహన్ తెలంగాణ వంటగ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి….
IMG_20250107_184045

మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జనవరి 7: వంటగ్యాస్ వాడకం దారులు కాలం చెల్లిన సురక్ష రబ్బరు ట్యూబులు వెంటనే మార్చకోవాలని తెలంగాణ వంటగ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి, హుజూరాబాద్ అంబుజా గ్యాస్ ఏజన్సీస్ అధినేత పివి మదన్ మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం నాడు రాత్రి హుజూరాబాద్ అంబుజా గ్యాస్ ఏజన్సీలో షోరూం స్టాప్ డెలివరీ సిబ్బందికి పునశ్చరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ తరగతుల్లో ఏజన్సీ ద్వారా కస్టమర్లకు అందిస్తున్న గ్యాస్ సిలిండర్లు, కస్టమర్ల భద్రత కొరకు చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. భారత ప్రభుత్వ పెట్రోలియం మంత్రిత్వ శాఖ గత ఎప్రిల్ నుండి అన్ని ఆయిల్ సంస్థలు (IOCL, HPCL,BPCL) యల్పీజి వాడకం దారులకు ప్రాథమిక భద్రతా చర్యలు ( బియస్సీ )బేసిక్ సేప్టీ చెక్స్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఇందులో భాగంగా డెలివరీ బాయ్ కస్టమర్ ఇంటిని సందర్శించి ఎనమిది అంశాలతో కూడిన ప్రశ్నావళితో వంటగ్యాస్ స్థితిగతలపై పరిశీలన జరిపే కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన డెలివరీ సిబ్బందికి ఆయిల్ కంపనీలు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నాయని వివరించారు. ఈ వెసులుబాటు డిసెంబరు నెలతో ముగిసిందని తెలిపారు. ఇందులో ముఖ్యంగా “సురక్ష రబ్బరు ట్యూబ్” కాలపరిమితి ఐదు సంవత్సరాలు, పరిమితి దాటిన రబ్బరు ట్యూబులు విధిగా మార్చడం,
ఏదేని లీకేజ్ సమయంలో టోల్ ప్రీ నంబరు 1906 సమాచారం అందించడం, ఒకే కంపెనీకి చెందిన సిలిండర్లు రెగ్యులేటర్ వాడడం, ఈ కేవైసి, ఇతర ప్రాథమి భద్రతా చర్యలపై అవగాహన కల్పించేందుకు క్రుషి చేశామని తెలిపారు. అయితే చాలా మంది కాలపరిమితి దాటిన సురక్ష రబ్బరు ట్యూబులు వాడుతున్న కస్టమర్లు వున్నారని వారు వెంటనే కొత్త సురక్ష రబ్బరు ట్యూబ్ పొంది ప్రమాద భీమాకు అర్హత పొందాలని సూచించారు.
కస్టమర్లకు అందించే రబ్బరు ట్యూబ్ పై తయారీ తేది, కాలపరిమితి ముద్రించబడి వుంటుందని దానిని పరిశీలించి రబ్బరు ట్యూబ్ మార్చుకోవచ్చని మదన్ మోహన్ తెలిపారు.
మార్చి చివరి నాటికి ఆయా ఏజన్సీలలో గ్యాస్ తీసుకునే వారందరికి కాలపరిమితి దాటినసురక్ష రబ్బరు స్థానంలో కొత్త రబ్బరు ట్యూబ్ అందించి ప్రమాద రహిత కిచెన్లుగా తీర్చిదిద్దాలని ఆయిల్ కంపనీల యోచన అని ఆయన తెలిపారు. ప్రతి కస్టమర్ బుక్ చేసిన మరుసటిరోజు సిలిండర్ అందించేలా డెలివరీ సిబ్బంది చూడాలని సిలిండర్ అందించే సమయంలో ప్రీ డెలివరీ చెక్ సీలు తీసి ఓ రింగు ఉందా లేదా?నాణ్యమైనదా లేదా? కస్టమర్ కోరితే సిలిండర్ తూకం వేసి సిలిండర్ గ్రాస్,వేయిట్,టేర్ వేయిట్ అంటే సిలిండర్ బరువు అందులో నింపిన గ్యాస్ బరువును చూపి కస్టమర్లను సంత్రుప్తి పరచాలని, వారితో మర్యాదగా నడుచుకోవాలని, ఈ కేవైసి ప్రతి కస్టమర్ ఐఓసియల్ ఆప్ ద్వారా స్వయంగా లేదా డెలివరీ బాయ్ ఆప్ ద్వార చేసుకునేలా చొరవ చూపాలని ఈ పునశ్చరణ కార్యక్రమంలో పివి.మదన్ మోహన్ సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ దేవేందర్ రెడ్డి, సీనియర్ కస్టమర్లు మొండయ్య, ఒల్లాల రమేశ్, కరాటే రమేశ్, స్టాప్ పవన్, శరత్, భరత్, సరిత, భరత్ రెడ్డి, సీనియర్ డెలివరీ సిబ్బంది కనకయ్య, చిరంజీవి, ప్రభు, దామోదర్, కుమార్, భాస్కర్, ప్రశాంత్, నర్సయ్య, రాజు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. ‌

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!