07-01-2025 NORMAL NEWS 07:20 PM
swarnodayam.com
Telugu Daily News
07-01-2025 07:20 PM By Mandala Yadagiri

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అల్పాహారం సదుపాయం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అల్పాహారం సదుపాయం
IMG_20250107_191736

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక స్టడీ అవర్స్ ను గత నెల రోజులనుండి కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం స్టడీ అవర్స్ కు హాజరయ్యే విద్యార్థులకు ఆకలి నుండి ఉపశమనానికి గాను కళాశాల అధ్యాపకుల ఆర్థిక సహాకారంతో మంగళవారం సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్ ను కళాశాల ప్రిన్సిపాల్ వి అంజనేయరావు అందజేశారు. ఈ సందర్భముగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు మీరు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరుతో పాటు, మీకు ఏమన్నా సందేహాలు ఉంటే సంబధిత అధ్యాపకులతో నివృత్తి చేసుకొని వందశాతం ఫలితాలు సాధించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!