Social 1080×1350 • Multi-page
09-01-2025 BREAKING NEWS 10:10 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రవాస భారతీయుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రవాస భారతీయుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
IMG-20250109-WA0034

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉంటోన్న భారతీయులు అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధిలో ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ పాత్ర ముఖ్యమైనదని, తెలంగాణ రైజింగ్ కార్యాచరణలోనూ ఎన్నారైల భాగస్వామ్యం ఆవశ్యకమని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా గొప్ప పేరు పొందిన తర్వాత స్వజనుల సేవ కోసం, స్వరాజ్య సాధనలో భాగం కావడానికి 1915, జనవరి 9న ముంబైకి తిరిగి వచ్చిన సందర్భానికి గుర్తుగా ఈ తేదీన ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని గుర్తుచేశారు.

ప్రవాసుల పెట్టుబడులు, ఆలోచనలకు తెలంగాణ చక్కటి వేదికగా ఉండటమే కాదు, ప్రవాసీ ప్రజావాణి లాంటి వినూత్న కార్యక్రమాలతో గల్ఫ్, ఇతర దేశాల్లోని కార్మికుల సంక్షేమానికి కూడా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!