11-01-2025 NORMAL NEWS 06:05 PM
swarnodayam.com
Telugu Daily News
11-01-2025 06:05 PM By Mandala Yadagiri

బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులుగా తూర్పాటి రాజు

బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులుగా తూర్పాటి రాజు
IMG_20250111_175924

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన సీనియర్ నాయకుడు తూర్పాటి రాజు నియామకమయ్యారు. రాజు ఏబీవీపీ
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీలో వివిధ సంస్థలో చురుకుగా పని చేశారు. ముందుగా ఏబీవీపీలో 2010లో కార్యకర్తగా మొదలయి పట్టణ సహాయ కార్యదర్శిగా, టెక్నికల్ కన్వీనర్ గా RSSలో ఎదులాపురం ఖండ శారీరక్ గా, బీజేపీ ఎస్సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ హుజురాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘంగా పని చేసి నిరంతరం సంస్థ అభివృద్ధి కోసం పాటు పడ్డాడు. దీంతో ఆయన సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షునిగా నియమించారు. కాగా తన నియామకానికి సహకరించిన, కృషిచేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి, బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డికి, జిల్లా నాయకులకు, పట్టణ నాయకులకు బిజెపి పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికకు సహకరించినందుకు రాజు ధన్యవాదాలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!