Social 1080×1350 • Multi-page
11-01-2025 BREAKING NEWS 09:18 PM
swarnodayam.com
Telugu Daily News

కొత్తకొండ జాతరకు హుజురాబాద్ నుండి ప్రత్యేక బస్సులు

కొత్తకొండ జాతరకు హుజురాబాద్ నుండి ప్రత్యేక బస్సులు
IMG-20241219-WA0154

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హనుమకొండ జిల్లా భీమాదేవరపల్లి మండలం కొత్తకొండ జాతరకు హుజురాబాద్ నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వి రవీంద్రనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తేది :13-01-2025, నుండి 16-012025, వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందన్నారు. పెద్దలకు :50=00 రూపాయలు, పిల్లలకు :30=00 రూపాయలు. హుజురాబాద్ నుండి వయా గోపాల్పూర్, ద్వారా కొత్తకొండకు,
హుజురాబాద్ నుండి వయా పెంచికలపేట ద్వారా కొత్తకొండకు,
హుజురాబాద్ నుండి వయా మానిక్యాపూర్ ద్వారా కొత్తకొండకు
స్పెషల్ బస్సులు నడుపుతున్నామని హుజురాబాద్ డిపో మేనేజర్ తెలియజేశారు. కావున ఇట్టి అవకాశాన్ని భక్తులు వినియోగించు కోవాలని డిపో మేనేజర్ తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!