Social 1080×1350 • Multi-page
12-01-2025 BREAKING NEWS 12:35 PM
swarnodayam.com
Telugu Daily News

నవ భారత స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద…ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్

నవ భారత స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద…ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్
IMG_20250112_123329

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నవ భారత స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో 162 స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద విగ్రహానికి పులా మాల వేసి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ మాట్లాడుతూ వివేకానందుడు భారతీయకు నిలువెత్తు నిదర్శనం అని, ప్రపంచ దేశాలకు భారత ఖ్యాతినీ విస్తరింపచేసిన మహాభావుడు అన్నారు. భారతీయ విలువలను, సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన కర్మయోగి అని, వివేకాకానందుని ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని, అదేవిధంగా వివేకానంద స్ఫూర్తి యువతకు,విద్యార్థులకు ఆదర్శం అన్నారు.ఈ దేశం భవిత యువతగా మన మీదనే ఆధారపడి ఉందన్నారు. ఈ దేశాన్ని విచ్చిన్నం చేయడానికి విదేశీ భావజాల శక్తులు పనిచేస్తున్నాయని, కులం పేరుతో, మతంపేరుతో, ప్రాంతాల పేరుతో విభజన రేఖలు గీయడానికి ప్రయత్నిస్తున్న శక్తులు కళాశాల క్యాంపస్ లను,యూనివర్సిటీలను వేదికగా చేసుకుంటున్నాయని వాటిని తరిమికొట్టే భాధ్యత ఈ దేశ పౌరులుగా మన మీద ఉండాలన్నారు. ఆర్థికంగా,శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి వైపు మన దేశం దూసుకెళ్తున్న ఈ తరుణంలో యువత మంచి మానవనరులుగా తయారయ్యి దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలన్నారు. విశ్వ గురు గా భారత్ ఆవిర్భవించాలన్న, వికాసిత్ భారత్ గా భారత్ ఆవిర్భవించాలన్న ముందుగా యువత ఈ దేశ పట్ల ప్రేమ, భక్తి కలిగి ఉంటేనే సాధ్యమవుతుందని అన్నారు.మహనీయుల ఆశయాలను పునికి పుచ్చుకొని నిరంతరం దేశ సంరక్షణ కోసం మనందరం కూడా పనిచేయాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ABVP నగర సంయుక్త కార్యదర్శి అరిఫ్, నగర ఉపాధ్యక్షులు బిట్టు, యశ్వంత్, సాంబరాజు, సిద్దు, గౌతమ్, అజయ్, భార్గవ్, శివ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!