Social 1080×1350 • Multi-page
12-01-2025 BREAKING NEWS 01:38 PM
swarnodayam.com
Telugu Daily News

యువతి అదృశ్యంపై కేసు నమోదు.

యువతి అదృశ్యంపై కేసు నమోదు.
IMG-20250112-WA0084

కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన సంగి శంకర్ అనే వ్యక్తి కూతురు గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేయగా జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శంకర్ కు ముగ్గురు పిల్లలు కాగా అందులో పెద్ద కూతురు అస్మిత(19) కరీంనగర్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. కరీంనగర్ లోని హాస్టల్లో ఉంటూ చదువును కొనసాగిస్తుండగా సంక్రాంతి సెలవులు రావడంతో స్వగ్రామమైన బిజిగిరి షరీఫ్ కు వచ్చిందన్నారు. అయితే హాస్టల్లో తన దుస్తులు ఉన్నాయని చెప్పి ఈనెల10వ తారీకున అస్మిత కరీంనగర్ హాస్టల్ నుండి బట్టలు తీసుకు వస్తానని చెప్పి వెళ్ళి రాత్రి తొమ్మిది అయినా కూడా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తనకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. వారి బంధువులకు కూడా ఫోన్ చేయగా అక్కడికి రాలేదని తెలపడంతో శనివారం కరీంనగర్ హాస్టల్ కు వెళ్లి తల్లిదండ్రులు విచారించగా తమ కూతురు ఎనిమిదో తారీకుననే ఇంటికి వెళ్లినట్టుగా హాస్టల్ సిబ్బంది తెలపడంతో జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా యువతి మిస్సింగ్ కేసును నమోదు చేసినట్టుగా జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!