Social 1080×1350 • Multi-page
12-01-2025 BREAKING NEWS 03:37 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు..భారతీయ యువతర వీరుడు స్వామి వివేకానంద. -బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.

ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు..భారతీయ యువతర వీరుడు స్వామి వివేకానంద. -బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.
IMG_20250112_151913

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ యువతర వీరుడు, ఆధునిక భారత జాతీయవాదానికి పితామహుడు, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రంపంచమంతా చాటి చెప్పిన మహనీయుడు వివేకానందస్వామి అని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. బిజెపి హుజురాబాద్ పట్టణశాఖ అధ్యక్షుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 12న స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా భారతీయులు ప్రతి ఏడాది జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడన్నారు. ముఖ్యంగా 1893లో చికాగోలో జరిగిన సర్వమంత సమ్మేళన సభలో స్వామి వివేకానంద చేసిన అనితర సాధ్యమైన ప్రసంగం గుర్తుకు తెచ్చుకుంటే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తాయన్నారు. స్వామి వివేకానంద ప్రసంగం పాశ్చాత్య ప్రపంచానికి హిందూ తత్వశాస్త్రాన్ని పరిచయం చేసిందన్నారు. తన పుస్తకాలలో ప్రాపంచిక సుఖాలు, అనుబంధాల నుండి మోక్షాన్ని పొందటానికి నాలుగు మార్గాలను వివరించారని, అవేరాజయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగమన్నారు. వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువతరం ముందు కొనసాగాలన్నారు. అనంతరం యువ ఫౌండేషన్ మరియు బిజేపి పట్టణశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు విధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, కౌన్సిలర్ పైళ్ళ వెంకటరెడ్డి, నల్ల సుమన్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, సీనియర్ నాయకులు అంకటి వాసు, తిప్పబత్తిని రాజు, యాళ్ల సంజీవరెడ్డి, సబ్బని రమేష్, యంసాని శశిధర్, కొలిపాక శ్రీనివాస్, గంగిశెట్టి ప్రభాకర్, నరేడ్ల ప్రవీణ్ రెడ్డి, నాంపల్లి సుమన్, కొలిపాక వెంకటేష్, బోరగాల సారయ్య, మొలుగూరి నగేష్, నాసాని కేశవ్, యువ సంస్థ ప్రతినిధులు నరేష్, రామకృష్ణ, ప్రణీత్, మధు పటేల్, శ్రావణ్, తరుణ్ తేజ, ప్రదీప్, అజయ్, కొండాల్ రెడ్డి, చిరంజీవి, శివ, యాట రాజేష్ కన్నా, బెజ్జంకి రవీందర్, సొల్లు సాల్మన్, గుండేటి భార్గవ్, క్యాస వెంకటేష్, వెంకటేష్, సమ్మయ్య, మాటూరి వెంకట్, గూళ్ళ అనిల్, తాళ్లపెళ్లి హరీష్, రాపాక రాజు, గంధం అనిల్, తూర్పాటి రాజకుమార్, సాంబశివ, విజయ్, రాము, సామాజిక కార్యకర్త అంగన్వాడీ టీచర్ కోటోజు జ్యోతిరాణి, బీజేపీ హుజురాబాద్ మండల నాయకులు, హైందవ సోదరులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!