12-01-2025 NORMAL NEWS 10:52 PM
swarnodayam.com
Telugu Daily News
12-01-2025 10:52 PM By Mandala Yadagiri

నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి

నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి
IMG-20250112-WA0168

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ మాజీ ఎంపీ మంద జగన్నాథం తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ లోని నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితమే ఆయన మరణించారు.
నాగర్ కర్నూల్ ఎంపీగా 4 సార్లు పని చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1996లో ఆయన తొలిసారిగా టీడీపీ తరఫున నాగర్‌కర్నూల్‌ ఎంపీగా విజయం సాధించారు. 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్‌పై విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కలేదు. ఈ నేపథ్యంలో 2022, జూలై 1న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అప్పటి సీఎం కేసీఆర్‌ ఆయనను నియమించారు. 2023 నవంబర్‌ 17న బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే నాగర్‌కర్నూల్‌ టికెట్‌ దక్కకపోవడంతో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!