Social 1080×1350 • Multi-page
13-01-2025 BREAKING NEWS 12:51 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ సిద్ధార్థనగర్ లో భోగి సంబరాలు.

హుజురాబాద్ సిద్ధార్థనగర్ లో భోగి సంబరాలు.
IMG-20250113-WA0073

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని సిద్దార్ద నగర్ కాలనిలో భోగి మంటల కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. కాలని అధ్యక్షుడు సాగి వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి బండ సంపత్ రెడ్డి భోగి మంటలను ప్రారంభించారు. కుటుంబ సమేతంగా కాలనీ ప్రజలు మహిళలు పురుషులు పాల్గొని అందరికి శుభం జరగాలని అగ్నిహోత్రుణ్ణి వేడుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సాగి వీరభద్రరావు మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారు ఏ ప్రాంతంలో ఉన్నా గొప్పగా జరుపుకునే పండుగ భోగి అని అన్నారు. సూర్య భగవానుడు ఉత్తరాయన పుణ్యకాలానికి ప్రవేశించే సందర్భం అని వివరించారు. పురాణాల ప్రకారం గోదాదేవి ధనుర్మాసంలో నెలరోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చిన శ్రీమహా విష్ణువు శ్రీరంగనాథునిగా భువికి దిగివచ్చి గోదాదేవిని చేరి
దేవికి బోగభాగ్యాలు ప్రసాదించిన రోజుగా నాటినుండి భోగి
పండుగ జరుపుకుంటున్నట్లు వారు వివరించారు. భోగి మంటలు
ఆధునిక సైన్స్ తో ముడిపడివుందని అభిప్రాయపడ్డారు. ఈ
కార్యక్రమంలో పీడీ రాజిరెడ్డి, జి రవీందర్, విశ్రాంత ఉపాద్యాయులు లింగారావు, జయవర్ధన్, మంచికట్ల శ్రీనివాస్, రాజమౌళి, యం రాజిరెడ్డి, బి మనోజ్, విజయ్, వేణుగోపాల్ రెడ్డి
తిరుపతిరెడ్డి, శంకర్, సురేందర్ రావు, కేశవరెడ్డి, అంబరీష్, ,శ్రీనివాస్, శివప్రసాదరావు, రఘునాథం, మహిళలు, పిల్లలు
పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!