15-01-2025 NORMAL NEWS 11:09 PM
swarnodayam.com
Telugu Daily News
15-01-2025 11:09 PM By Mandala Yadagiri

ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారి

ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారి
Oplus_131072

స్వర్ణోదయం ప్రతినిధి, జగిత్యాల జనవరి 15:
లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆసిఫోద్దిన్ ఈరోజు ఏసీబీకి చిక్కారు. భూ యజమాని ఇచ్చిన స‌మాచారం మేర‌కు కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మెట్ పల్లి పట్టణంలో సాయిరాం కాలనీలోని 266 గజాల స్థలంను మార్టిగేజ్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ పదివేలు డిమాండ్ చేశారు. స్తోమత లేని భూ య‌జ‌మాని ఎసిబికి స‌మాచారం అందించాడు

దీంతో ఏసిబి డిఎస్పి వివి రమణమూర్తి కార్యాలయంపై దాడులు నిర్వహించి అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొదటి విడతలో రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు స‌బ్ రిజిస్ట్రార్ ను పట్టుకున్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ అటెండర్ బాణోతు రవికుమార్, డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవిని అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!