Social 1080×1350 • Multi-page
15-01-2025 BREAKING NEWS 11:44 PM
swarnodayam.com
Telugu Daily News

ఎఐసిసి నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభించిన‌ ఖ‌ర్గే…

ఎఐసిసి నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభించిన‌ ఖ‌ర్గే…
IMG-20250115-WA0174

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: కొత్త ఢిల్లీలోని కోట్లా రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆరు అంతస్థుల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ నేడు ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు.

ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డులోనే కాంగ్రెస్ కార్యకలాపాలు నిర్వహించింది. 1978 నుంచి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా ఉంది.

కోట్లా మార్గ్కు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినా.. అక్బర్ రోడ్డు నుంచి కూడా కార్యకలాపాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2008లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చుకున్నారు. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం మొదలు పెట్టారు. 15 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం సాగింది. దీనిని నేడు లాంచ‌నంగా ప్రారంభించారు. ఈ నూతన భవనానికి ఇందిరా భవన్ గా నామకరణం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!