17-01-2025 NORMAL NEWS 06:36 PM
swarnodayam.com
Telugu Daily News
17-01-2025 06:36 PM By Mandala Yadagiri

ఇండేన్ డీలర్లు తమ గ్యాస్ వాడకందారులకు మెరుగైన సేవలు అందించాలి.. -ఇండియన్ కార్పోరేషన్ తెలంగాణ, ఆంధ్ర విక్రయ విభాగం సీనియర్ అధికారిణి ..కె.కీర్తి.

ఇండేన్ డీలర్లు తమ గ్యాస్ వాడకందారులకు మెరుగైన సేవలు అందించాలి.. -ఇండియన్ కార్పోరేషన్ తెలంగాణ, ఆంధ్ర విక్రయ విభాగం సీనియర్ అధికారిణి ..కె.కీర్తి.
IMG_20250117_183330

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ జనవరి17:
వంట గ్యాస్ వాడకందారలకు మరిన్ని సేవలు అందించడంలో ఇండేన్ గ్యాస్ డీలర్ల పాత్ర ప్రముఖంగా వుండాలని ఐఓసియల్ సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ విక్రయ అధికారిణి కె.కీర్తి కోరారు.
కరీంనగర్ లోని కెయస్ వేడుకల మందిరంలో శుక్రవారంనాడు నిర్వహించిన కరీంనగర్ సేల్స్ ఏరియా1 ఇండేన్ గ్యాస్ డీలర్ల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రానున్న కాలంలో వంటగ్యాస్ వ్యాపారాన్ని ప్రవేట్ సంస్థలు చేపట్టె అవకాశాలు వున్నాయని వారికి దీటుగా కస్టమర్లకు సేవలందిస్తే మనం‌ కస్టమర్లను కాపాడుకునేందుకు అవకాశం వుంటుందని తెలిపారు. ఇది ఒక్క ఐఓసియల్ కే కాక అన్ని కంపెనీలకు వర్తిస్తుందని తెలిపారు. గ్యాస్ వాడకందారులకు సిలిండర్లు అందించే సమయంలో ప్రీడెలివరి చెక్ (పిడిసి) డెలివరి సిబ్బంది నిర్వహించాలని‌ ముఖ్యంగా సిలిండర్ సీల్ తొలగించడం వాల్వు వుండే ఓ రింగ్ గమనించడం, సిలిండర్ నాణ్యత,తూకం గమనించాలని కోరారు. ఐఓసియల్ నిర్వహించిన బేసిక్ సేప్టీ చెక్ ప్రాథమిక భద్రతా తనికీ కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగి వారు వాడే గ్యాస్ కనెక్షన్లు పరిశీలించి భద్రతపై అవగాహన కల్పించేందుకు చొరవచూపామని‌ తెలిపారు. ఇందులో గ్యాస్ లీకేజి సమయంలో 1906 టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదులు చేయడం, కాలం‌ చెల్లిన సురక్ష రబ్బరు ట్యూబ్ మార్చడం, కస్టమర్ ఏ కంపనీకి‌ చెందిన సిలిండర్, రెగ్యలేటర్ వాడుతున్నారో అవే కలిగి వుండాలని సూచించారు.
మార్చి చివరి నాటికి‌ విధిగా సురక్ష రబ్బరు ట్యూబ్ మార్చకునే విధంగా కస్టమర్లు సహకరించాలని కోరారు. ఐఓసియల్ కరీంనగర్ విక్రయ విభాగం1 అధికారి మిట్ట మహేశ్ మాట్లాడుతూ యిటీవల జరిగిన గ్యాస్ ప్రమాదాలకు కారణం నాణ్యత ప్రమాణాలను లేని రబ్బరు ట్యూబులు వాడడం,ఐదేళ్ల కాలపరిమితి దాటిన సురక్ష రబ్బరు ట్యూబులు వాడడం వల్లనే అని అందుకే పెట్రోలియం శాఖ గత ఎప్రిల్ నుండి ఉచితంగా ప్రాథమిక భద్రతా తనిఖీ బియస్సీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఇందులో‌ గ్యాస్ పైపు నాణ్యత, గతంలో అందచేసిన సురక్ష రబ్బరు ట్యూబ్ కాలపరిమితి పరిశీలిండం,ఇతర భద్రత సూచనలు తెలియచేయడం జరిగిందని‌ తెలిపారు.
ఇంకా వేలాది కస్టమర్లు నాణ్యత ప్రమాణం లేని,కాలంచెల్లిన సురక్ష రబ్బరు ట్యూబులు వాడతున్నారని వారు వెంటనే నూతన సురక్ష రబ్బరు ట్యూబ్ పొందాలని‌ దాని కాలపరిమితి ఐదేళ్ల వరకు వుంటుందని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశంలో కస్టమర్ల సహకారం కోరుతుందని తెలిపారు. ఈకేవైసి ఇంకా చేయని కస్టమర్లు విధిగా చేసుకోవాలని కోరారు.అదే విధంగా వంటగ్యాస్ ప్రమాదం వల్ల మంటలు చెలరేగినప్పుడు మంటల నివారణకు పోర్టబుల్ ఫైర్ బాల్ అందుబాటులోకి ఐఓసియల్అందుబాటులోకి‌ తెచ్చిందని దీని‌ ధర అత్యల్పంగా వుంటుందని ప్రతి గ్యాస్ వాడకం దారు ఈ ఫైర్ బాల్ తమ ఇండేన్ డీలర్ల వద్ద కొనగోలు చేయాలని కోరారు. సీనియర్ యల్పీజి డీలర్, అంబుజా గ్యాస్ ఏజన్సీ‌ అధినేత పి.వి.మదన్ మోహన్ మాట్లాడుతూ గ్యాస్ ప్రమాదాలు కేవలం అవగాహన లోపం‌ వల్ల జర్గుతున్నాయని కాబట్టి ప్రాథమిక‌ భద్రతా అంశాలపై అవగాహన వుండాలని వీటిలో ముఖ్యంగా కిచన్ ప్లాట్ ఫాం,ప్రభుత్వం ఆమోదించిన గ్యాస్ ఉపకరణాలు వాడడం,సురక్ష రబ్బరు ట్యూబ్ కలిగి వుండడం, కిచెన్ వెంటిలేషన్, ఏదేని గ్యాస్ లీకేజి సమయంలో విద్యుత్ పరికరాలను వాడకపోవడం,విధిగా టోల్ ఫ్రీ నంబర్ 1906 సమాచారం యివ్వడం లాంటి చర్యలు చేపట్టాలని సూచించారు. వంటగ్యాస్క స్టమర్లకు ప్రమాద బీమా వర్తిస్తుందని కాబట్టి ఆయిల్ కంపనీల నియమాలకు కట్టుబడి వుండాలని కోరారు. ఈ సమావేశంలో సీనియర్ డీలర్లు సుభాష్ రావు, రాధక్రిష్ణ, ప్రవీణ్, శ్రీధర్, గట్టు రాజయ్య, అమరీష్, రాము, హన్మంత్ పటేల్, వెంగళరావు, అజయ్, వెంకటేశ్వర రావు, నరేందర్, శ్రీరాజకుమార్,
మోహిత్, మీరాబాయ్, గీత తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072 మాట్లాడుతున్న కీర్తి
Oplus_131072 మాట్లాడుతున్న పీవీ మదన్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!