17-01-2025 NORMAL NEWS 06:50 PM
swarnodayam.com
Telugu Daily News
17-01-2025 06:50 PM By Mandala Yadagiri

సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మహమ్మద్ రషీద్..

సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మహమ్మద్ రషీద్..
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మహమ్మద్ రషీద్ పదోన్నతి పొందారు. రషీద్ హనుమకొండ జిల్లాలో రెండు సంవత్సరాలు పనిచేసిన అనంతరం డిప్యూటేషన్ పై హుజురాబాద్ లో సెరికల్చర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా జూలై 2024 నుండి జిల్లాలో ఒకే ఒక అధికారిగా పట్టు సాగు చేస్తున్న రైతులకు సలహాలు సూచనలు అందిస్తూ పట్టు పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశాడు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హుజురాబాద్ మండలం చిన్నపాపయ్యపల్లి, రంగాపూర్, గ్రామాలకు ప్రత్యేక అధికారిగా పనిచేశారు. శాఖా పరమైన అర్హతలు ఉన్నందున రషీద్ సహాయపట్టు పరిశ్రమ అధికారిగా పదోన్నతి కల్పిస్తూ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ యాస్మిన్ భాష ఉత్తర్వులు జారీ చేశారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!