17-01-2025 NORMAL NEWS 07:37 PM
swarnodayam.com
Telugu Daily News
17-01-2025 07:37 PM By Mandala Yadagiri

కౌశిక్ రెడ్డి చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకుల పాలాభిషేకం.. ఎమ్మెల్యే ని అవమానించిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

కౌశిక్ రెడ్డి చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకుల పాలాభిషేకం.. ఎమ్మెల్యే ని అవమానించిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
IMG-20250117-WA0058(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేయడాన్ని ఖండిస్తూ కౌశిక్ రెడ్డి చిత్రపటానికి అదే ప్రాంతం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే అని అవమానపరిచిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను పందిపై పెట్టి కూడా ఊరేగించగలం..కానీ మాకు సంస్కారం ఉంది, మాకు నైతిక విలువలు అడ్డుగా వస్తున్నాయి అన్నారు. ప్రజాస్వామ్యంలో ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఇలాంటి చిల్లర విషయాలు ఇప్పటికైనా మానుకోండి అని అన్నారు. కౌశిక్ రెడ్డి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే ఈ వికృతమైన చేష్టలకు దిగుతున్నారు..మీరు ఎంత గింజుకున్నా…మీ నాయకుడిని నాయకుడిగా ప్రజలు గుర్తించరు.. మీరు మాత్రమే నాయకుడిగా గుర్తించాలి.. ఇది సత్యం అని వారి పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు కూడా.. మీ నాయకుడిని గుర్తించడం లేదు అన్నది సత్యం, మీ నాయకుడిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని చెప్పారు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే.. జోకులు వేసుకుంటున్నారనీ, మీ నాయకుడికి నాయకత్వ లక్షణాలు ఏమాత్రం లేవు అని, అతడు ఎప్పుడూ అమూల్ బేబీనే…అంటూ ఎగతాళి చేశారు. కౌశిక్ రెడ్డి.. రాష్ట్రంలోనే అధికార పార్టీని గడగడలాడిస్తున్న నేత అని, కౌశిక్ ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం మీ నేతకు లేదు అని అన్నారు. మీరు ఎన్ని దిష్టిబొమ్మలు కాలబెట్టినా.. అయ్యేదేమీ లేదు..కౌశిక్ వెనుక ప్రజలు ఉన్నారు.. కచ్చితంగా ఆయన ప్రజాక్షేత్రంలో దూసుకుపోతారు అని చెప్పారు. ఆయనను అడ్డుకోవడం మీ వల్ల కాదు.. మీ ముఖ్యమంత్రి తోనే చెడుగుడు ఆడుతున్నాడు.. మీరెంత మీ లెక్కెంత..అన్నారు. కౌశిక్ రాష్ట్రస్థాయి నాయకుడనీ, మీ నాయకుడు గల్లీ నాయకుడు కూడా కాదు.. కనీసం వార్డ్ మెంబర్ కు కూడా గెలిచే సత్తా లేదు అని ఎద్దేవా చేశారు. మొన్నటి ఎన్నికల్లో.. మూడో స్థానంలో నిలిచాడు.. ఈసారి డిపాజిట్ కూడా రాదు.. రాసి పెట్టుకోండి.. అని జోస్యం చెప్పారు. మీ నాయకుడిని సింగాపురంలోని ఆయన ఇంటిలో లాలీపప్ నోట్లో పెట్టి ఉయ్యాలలో పడుకోబెట్టి లాలి పాట పాడండి.. అంటూ ఎగతాళి చేశారు. సమస్యలపై పోరాటం చేసే సత్తా.. ప్రభుత్వాన్ని నిలదీస్తే సత్తా.. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికే ఉన్నాయనీ వాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు హర్షద్, ఆర్ భరత్ రెడ్డి, టి రాకేష్, కే అఖిల్, ఇర్ఫాన్, బి రాము, అఖిల్, షఫీ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!