18-01-2025 NORMAL NEWS 02:17 PM
swarnodayam.com
Telugu Daily News
18-01-2025 02:17 PM By Mandala Yadagiri

రాజకీయాలకు సరికొత్తనిర్వచనం నేర్పిన నేత ఎన్టీఆర్ -పోలాడి రామారావు.

రాజకీయాలకు సరికొత్తనిర్వచనం నేర్పిన నేత ఎన్టీఆర్ -పోలాడి రామారావు.
IMG_20250118_141551

ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలి

తెలుగు ప్రజల ఆరాధ్య
కథానాయకుడు

పేదల సంక్షేమం కోసం
నిరంతరం తపించిన నేత

పోలాడి రామారావు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నేత ఎన్టీఆర్ అని రైతు, ప్రజాసంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు అన్నారు. శనివారం కరీంనగర్ లోని సంఘ కార్యాలయంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులతో కలిసి పోలాడి రామారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం తెలుగు దేశం పార్టీని స్థాపించి ప్రాంతాలు వేరైనా తెలుగు వారంతా ఒక్కటేనని చాటి చెప్పి, 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రభంజనం సృష్టించారని, ఎన్టీఆర్‌తోనే తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ అని.. ఎన్టీఆర్ అంటే సినీ, రాజకీయ రంగంలో ప్రభంజనం, ఒక సంచలనం, తెలుగు వాడి విశ్వరూపం . వెండి తెరపై రారాజుగా వెలుగొందిన నటనా ప్రావేణ్యుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్పూర్తితో తాము ముందుకు సాగుతామన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గొప్ప సంస్కరణవాది అని, రాజకీయాల్లో నవశకానికి నాంది పలికారని పేర్కొన్నారు. పురాణ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించిన మహానటుడని కొనియాడారు. ఎన్టీఆర్ అంటే తెలుగు వారి గుండె చప్పుడని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి నవశకానికి బాటలు వేసి సమ సమాజ స్థాపనకు కృషి చేశారని చెప్పారు. దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారని, నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచారని రామారావు కొనియాడారు. 1984 లో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు అన్ని తుడుచుకు పెట్టుకొని పోయి బీజేపీ కేవలం రెండు లోకసభ సీట్లకు అందులో ఒకటీ టీడీపీ మద్దతు తో హన్మకొండ స్థానం గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ 400లకు పైగా సీట్లలో గెలిచి అతిరథ మహారథు ప్రతిపక్ష నాయకులను మట్టి కరిపించగా ఎన్టీఆర్ ఆధ్వర్యంలోని తెలుగు దేశం పార్టీ రాష్ట్రం లో 30 లోక్ సభ స్థానాలు గెలుచుకుని లోకసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ గా ప్రముఖ పాత్ర వహించి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించి తెలుగు వాడి సత్తాను ఎన్టీఆర్ ఎలుగెత్తి చాటారని ఇది తెలుగు వారికి గర్వ కారణమని పోలాడి పేర్కొన్నారు.

బడుగు బలహీనర్గాల్లో, యువతలో రాజకీయ చైతన్యాన్ని తెచ్చి, రాజ్యాధికారం లో భాగస్వామ్యం కల్పించి, నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని రామారావు అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఆయన అని గుర్తు చేశారు. పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికార పరమావధిగా ఆయన భావించారని చెప్పారు. అన్ని వర్గాలకు మంచి చేయాలనే తపనే ఎన్టీఆర్ ను మహోన్నత వ్యక్తి గా తీర్చి దిద్దిందన్నారు. దేశంలోనే మొదటి సారి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టి, సంక్షేమం తో పాటు పాలనా సంస్కరణలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రజల వద్దకే పాలన ఇందుకు నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా వేళ్ళూనుకుపోయిన పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి సామాన్య జనులకు ఎన్టీఆర్ ఎంతో మేలు చేకూర్చారని చెప్పారు.
తాలూకా, పంచాయతి సమితిలను రద్దు చేసి, రెవెన్యూ, మండల వ్యవస్థ ప్రవేశ పెట్టి ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారని కొనియాడారు. మొట్ట మొదటి సారిగా రాష్ట్రంలో స్ధానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ,ఎస్టీ, మహిళలకు రాజకీయ రిజర్వేషను ప్రవేశ పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఉద్యోగాల్లో మహిళకు రిజర్వేషన్లు కల్పించి,ఆస్తిలో వారికి సమాన హక్కుల ను కల్పించిన థీశాలి ఎన్టీఆర్ అని చెప్పారు. రాష్ట్ర సర్వతో ముఖాభీవృద్ధికి, రైతాంగ, బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అవిశ్రాంత కృషి చేసిన ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తూ
ఎన్టీఆర్ గారికి భారత రత్న అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి పోలాడి రామారావు విజ్ఞప్తి చేశారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!